Saturday 20 August 2016

రామాయణంలో లక్ష్మణ రేఖ ఉందా ? లేదా?

మారీచుడు "హే లక్ష్మణ.... హే సీత..." అని రాముని అనుకరించుచూ అరిచిన అరుపులు రామునివిగ తలచి వగచుచూ, రాముడు బంగారు లేడి కోసం వెల్లి ఆపదలలో చిక్కుకున్నాడని తలచి, సీతాదేవి లక్ష్మణని పరుష వాక్యములతో నిందించెను.

తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః  కృతాంజలి కించిదభిప్రణమ్యచ ||
అన్వీక్షమాణొ బహిశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్ ||

భావము: సీతాదేవి మొండివైఖరికిని, ఆమె పలికిన తీవ్రవచనములకును నొచ్చుకొనిన లక్ష్మణుడు దోసిలియొగ్గినవాడై, ఒక ప్రక్కగ నిలడి ఆమెకు నమస్కరించెను. పిమ్మట "ఈమెను ఇచ్చట ఒంటరిగ విడిచివెల్లుట ఎట్లు ?' అను తడబాటుతో ఆమె వైపు చూచుచు , మనస్సును దిటవు చేసికొని, శ్రీరాముని సమీపమునకు బయలుదెరెను.

తయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః |
స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థే నచిరాదివ ||

భావము: సీతాదేవి పరుషవచనములకు లక్ష్మణుడు మిగుల కలతచెందెను. సీతను ఒంటరిగా విడిచి వెల్లుటకు కాళ్ళాడకున్నను అన్నను త్వరగా చేరుటకై వెంటనే అతడు ఆశ్రమమును విడిచి బయలుదేరెను.

తదాసాద్య దశగ్రీవః క్షిప్రం అంతరమాస్థితః |
అభిచక్రామ వైదీహీం  పరివ్రాజకరూపదృత్ ||

భావము : తగిన అవకాశముకొఱకు ఎదురుచూచున్న దశగ్రీవుడైన రావణుడు, లక్ష్మణస్వామి అటువెల్లుట గమనించి, వెంటనే సన్యాసి వేషములో సీతాదేవి సమక్షమున నిలిచెను .


వరుసగా జరిగిన ఈ వృత్తాంతములో , ఎక్కడ కూడ లక్ష్మణస్వామి రేఖను గీసినట్లుగా వాల్మీకి రామయణములో లేదు.


ఇది ఆ తర్వాత వచ్చిన స్వేచ్చానువాదములలో (రామచరితమానస్, రంగనాధరామయణము ) ఉన్నది. ఉదాహరణకు రంగనాథ రామయణమునుండి స్వీకరింపబడిన ఈ క్రింద పద్యమును చూడండి. పర్ణశాల చుట్టూ 7 గీతలు గీసి అది దాటవద్దని సీతమ్మవారికి చెపుతూ, అది పరులెవరైనా దాటి వచ్చినట్లైతే వారి తల వేయి వ్రక్కలు అవుతుంది అని నిర్ణ్యం చెసి రాముని కలియుటకు లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళాడు.



తిరుమల తిరుపతి దేవస్థానంవారి publication రంగనాథరామయణములో  లక్ష్మణరేఖకు సంబంధించిన పద్యములేదు. It is missed or they might have not considered.

మరికొన్ని స్వేచ్చానువాద రామయణ గ్రంధములను పరిశీలించవలసియున్నది.





No comments:

Post a Comment